IPL 2021 : Rishabh Pant పాజిటివ్ Attitude.. బాధ దిగమింగుకున్న Captain || Oneindia Telugu

2021-10-14 100

Delhi capitals captain Rishabh pant emotional in post match presentation
#Ipl2021
#Morgan
#Rishabhpant
#ShreyasIyer
#Kolkataknightriders
#Delhicapitals
#Ipl2021Final

టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించి కీలక మ్యాచ్‌ల్లో ఓడి ఉత్త చేతులతో నిష్క్రమించడం చాలా బాధగా ఉందని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ అన్నాడు. తన ఫీలింగ్ ఎంటో చెప్పడానికి మాటలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కోల్‌కతా నైట్‌‌రైడర్స్‌తో బుధవారం జరిగిన క్వాలిఫయర్ 2లో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. విజయానికి చేరువగా వచ్చిన ఆ జట్టును తృటిలో ఫైనల్ చేరే అవకాశాన్ని కోల్పోయింది. ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం స్పందించిన రిషభ్ పంత్.. బ్యాటింగ్‌లో విఫలమైనా.. బౌ\లర్లు అద్భుతంగా పోరాడారని చెప్పుకొచ్చాడు. కానీ తృటిలో విజయాన్ని చేజార్చుకున్నామని తెలిపాడు.